పార్టీ ఎంపీలతో సీఎం కేసీఆర్‌ నేడు సమావేశం

తాజా వార్తలు

Updated : 10/09/2020 04:34 IST

పార్టీ ఎంపీలతో సీఎం కేసీఆర్‌ నేడు సమావేశం

హైదరాబాద్‌: పార్టీ ఎంపీలతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో నేడు సమావేశం కానున్నారు. ఈనెల 14నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది. పార్లమెంట్ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలు, జీఎస్టీ విషయంలో కేంద్రం వైఖరి, రాష్ట్రం అనుసరించాల్సిన విధానం తదితర అంశాలు చర్చకు రానున్నాయి. ఈ సమావేశంలో సీనియర్ అధికారులు కూడా పాల్గొననున్నారు. 
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని