‘పీజేఆర్‌ చావుకు వైఎస్‌ కారణం కాదా?’
close

తాజా వార్తలు

Updated : 25/06/2021 14:51 IST

‘పీజేఆర్‌ చావుకు వైఎస్‌ కారణం కాదా?’

తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శలు

దిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకం సెగలు కొనసాగుతున్నాయి. పోతిరెడ్డిపాడుకు డబుల్‌ దోపిడీ చేసేలా ఏపీ సీఎం జగన్‌ వ్యవహరిస్తున్నారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మండిపడ్డారు. ఏపీతో మంచిగా ఉండాలనుకున్నా.. జగన్‌ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనపై ఆయన నిప్పులు చెరిగారు. ఓ ముఖ్యమంత్రే తెలుగు గంగ పేరుతో నీళ్లు తరలిస్తే.. ఇప్పుడు కృష్ణా బేసిన్‌ పరిధిలో లేని నెల్లూరుకు తీసుకెళ్తామనడం సరికాదన్నారు. పాలమూరు-రంగారెడ్డికి ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో ఇచ్చారని.. కొత్తదేమీ కాదని చెప్పారు. 

వైఎస్‌ బతికుంటే తెలంగాణ వచ్చేది కాదంటూ ఇప్పటికీ ప్రజలు మాట్లాడుకుంటోంది వాస్తవం కాదా? అని శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడును తవ్వేటప్పుడే ఆరు మంత్రి పదవులను తెరాస వదిలేసిందని ఆయన గుర్తు చేశారు. వైఎస్‌ హయాంలో నీళ్లు, నిధులతో పాటు ఉద్యోగాల్లోనూ తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. తహసీల్దార్ల స్థానంలో ఆర్డీవోలను నియమించుకుని హైదరాబాద్‌లోని భూములను కాజేశారన్నారు. ఆనాడు మాజీ సీఎల్పీ నేత పి.జనార్దన్‌రెడ్డి (పీజేఆర్‌) పోతిరెడ్డిపాడుపై పోరాడితే ఎన్నో అవమానాలకు గురిచేశారని ఆరోపించారు. వైఎస్‌ సభలో వేదికపైకి ఆహ్వానించకపోవడంతో అక్కడే గుండెపోటుతో పీజేఆర్‌ కుప్పకూలారని చెప్పారు. పీజేఆర్‌ చావుకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కారకులు కాదా? అని శ్రీనివాస్‌గౌడ్‌ నిలదీశారు. 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని