తెలంగాణ వైకాపా అధ్యక్షుడి రాజీనామా

తాజా వార్తలు

Published : 03/04/2021 15:42 IST

తెలంగాణ వైకాపా అధ్యక్షుడి రాజీనామా

హైదరాబాద్‌: తెలంగాణ వైకాపా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయనే స్వయంగా వెల్లడించారు. జాతీయ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 2023 ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుంచి పోటీ చేస్తానని ఆయన అన్నారు.
రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నిరుద్యోగులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారన్నారని ఆయన ఆరోపించారు. ఓ గిరిజన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. యాదాద్రికి నిధులివ్వడం తప్ప తెరాస చేసిందేమీ లేదని, ఎలాంటి అభివృద్ధిపనులూ చేపట్టలేదని ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లాను సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని