Ap News: శాసనమండలి రద్దుపై న్యాయశాఖ మంత్రిని కలుస్తా: ఎంపీ రఘురామ

తాజా వార్తలు

Published : 16/10/2021 16:52 IST

Ap News: శాసనమండలి రద్దుపై న్యాయశాఖ మంత్రిని కలుస్తా: ఎంపీ రఘురామ

దిల్లీ: రాష్ట్రంలో కరెంట్‌ కోతలు ప్రారంభమయ్యాయని నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. శనివారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆక్వా సాగు ప్రాంతాల్లో రోజుకు మూడు గంటలు చొప్పున విద్యుత్‌ కోత విధిస్తున్నారని తెలిపారు. దిల్లీలో ఉన్నప్పటికీ  రాష్ట్ర ప్రజల గురించే ఆలోచిస్తున్నట్టు చెప్పారు. విద్యుదుత్పత్తికి బొగ్గు ఇవ్వలేని వారు.. ఆక్వాకు సీడ్‌, ఫీడ్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బొగ్గుపై సీఎం జగన్‌ రాసిన లేఖకు ప్రధాని స్పందించారనేది నిజమేనా? అని అనుమానం వ్యక్తం చేశారు.  విద్యుత్‌పై సీఎం జగన్‌ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. శాసనమండలిని రద్దు చేయాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని, పార్టీ ఎంపీగా ఈ విషయమై తాను కూడా న్యాయశాఖ మంత్రిని కలిసి కోరతానని రఘురామ వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని