Amarinder Singh: భాజపాలోకి అమరీందర్‌ సింగ్‌?

తాజా వార్తలు

Updated : 28/09/2021 14:30 IST

Amarinder Singh: భాజపాలోకి అమరీందర్‌ సింగ్‌?

చండీగఢ్‌ : పంజాబ్‌ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తన భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆయన భాజపాలో చేరనున్నట్లు తాజాగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నేడు దిల్లీ వెళ్లి.. భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో భేటీ కానున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు పంజాబ్‌ రాజకీయాలపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

దాదాపు వారం క్రితమే అమరీందర్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో పలువురు నాయకులతో పొసగక ఆయన చివరకు తన పదవిని వదులుకున్నారు. ముఖ్యంగా ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌ సింగ్‌ సిద్ధూతో గత కొంతకాలంగా ఆయనకు విభేదాలు నడుస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేల్లో కొంతమంది అమరీందర్‌ తొలగింపునకు పట్టుబట్టడంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం నాయకత్వ మార్పు వైపు మొగ్గుచూపింది. దీంతో చేసేది లేక అమరీందర్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం రాజకీయ సమీకరణాల దృష్ట్యా అధిష్ఠానం దళిత సామాజిక వర్గానికి చెందిన చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీకి సీఎం పీఠాన్ని కట్టబెట్టింది. అలాగే సుఖ్‌జీందర్‌ సింగ్‌ రంధావా, ఓపీ సోనీకి ఉపముఖ్యమంత్రి పదవి దక్కింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని