AP News: బ్రాహ్మణులపై వైకాపా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది: ఆనందసూర్య

తాజా వార్తలు

Published : 27/09/2021 01:39 IST

AP News: బ్రాహ్మణులపై వైకాపా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది: ఆనందసూర్య

అమరావతి: వైకాపా ప్రభుత్వం బ్రాహ్మణులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పుడుతోందని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ వేమూరి ఆనందసూర్య విమర్శించారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ ను బీసీ కార్పొరేషన్‌లో కలుపుతూ జీవో 103 జారీ చేయటం దుర్గార్గమని మండిపడ్డారు. జీవో 103 ద్వారా బ్రాహ్మణులకు ద్రోహం చేయడమేకాక బీసీలకు, బ్రాహ్మణులకు మధ్య గొడవలు సృష్టించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు కేటాయించి, జిల్లాల వారీగా బ్రాహ్మణ భవనాలు ఏర్పాటు చేస్తామన్న వైకాపా నేతలు.. జీవో 103 ద్వారా బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ కార్పొరేషన్‌లో విలీనం చేస్తే ఎందుకు నోరు మెదపటం లేదని నిలదీశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటిసారి ఏపీ తెలుగుదేశం ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రూ.500 కోట్లు కేటాయించి నిరుపేద బ్రాహ్మణులను ఆదుకుందని గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. జీవో 103ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, లేకపోతే బ్రాహ్మణులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని