CM Jagan: దేవుడి దయ వల్లే అఖండ విజయం: జగన్‌

తాజా వార్తలు

Published : 20/09/2021 01:43 IST

CM Jagan: దేవుడి దయ వల్లే అఖండ విజయం: జగన్‌

అమరావతి: దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనల వల్లే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించామని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజల ప్రేమాభిమానాలు ప్రతి కుటుంబం పట్ల  నా బాధ్యతను మరింత పెంచాయి. ‘‘రేపు ఉదయంలోపు ఎంపీటీసీ, జడ్పీటీసీల పూర్తి ఫలితాలు వస్తాయి. రేపు ఉదయం మరోసారి మీ అందరికీ వీడియో సందేశం ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాను’’ అని జగన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెలువడుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో వైకాపా దూసుకెళ్తోంది. ఎన్నికల ఫలితాలపై తొలిసారి జగన్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని