AP News: పవన్‌పైనే ప్రజలు తిరగబడే రోజు వస్తుంది: నారాయణస్వామి

తాజా వార్తలు

Updated : 29/09/2021 12:19 IST

AP News: పవన్‌పైనే ప్రజలు తిరగబడే రోజు వస్తుంది: నారాయణస్వామి

తిరుమల: వైకాపాను, సీఎం జగన్‌ను విమర్శించే అర్హత జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు లేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మండిపడ్డారు. వైకాపాలో చేరేందుకు పవన్‌ ఎన్నో ప్రయత్నాలు చేసినా జగన్‌ దరి చేరనీయలేదని ఆయన చెప్పారు. తిరుమల శ్రీవారిని వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నారాయణస్వామి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఈర్ష్యతోనే పవన్‌ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌పైనే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని నారాయణస్వామి తెలిపారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని