Ts News: కేసీఆర్‌ సారూ.. వీటికి జవాబు చెప్పండి: బండి సంజయ్‌

తాజా వార్తలు

Published : 28/09/2021 16:03 IST

Ts News: కేసీఆర్‌ సారూ.. వీటికి జవాబు చెప్పండి: బండి సంజయ్‌

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివసిస్తున్న ప్రగతి భవన్‌ అవినీతి భవన్‌గా మారిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. దేశంలోనే అత్యంత ధనవంతుడిగా సీఎం కేసీఆర్‌కు పేరుందని.. ఇది నిజమో.. కాదో.. నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి చూస్తే ఇప్పటివరకు సీఎం కేసీఆర్‌ ఆస్తులు లక్ష రేట్లు పెరిగాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్‌ పేరుతో కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని కొల్లగొట్టలేదా? అని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి, మిషన్‌ భగీరథ, ఇతర సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్‌ కొనుగోళ్లు, ప్రభుత్వ భూముల వేలంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇసుక, లిక్కర్‌, డ్రగ్స్‌ దందాలు, భూకబ్జాలకు సీఎం కుటుంబ సభ్యులు, తెరాస నేతలకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించగలరా? దీనిపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను అవినీతి సొమ్ముతో కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. బంగారు తెలంగాణ తెస్తానని చెప్పి అక్రమ మార్గాల ద్వారా కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని