Huzurabad By Election: ఈటల భారీ మెజారిటీతో గెలవబోతున్నారు: బండి సంజయ్‌

తాజా వార్తలు

Updated : 27/10/2021 13:02 IST

Huzurabad By Election: ఈటల భారీ మెజారిటీతో గెలవబోతున్నారు: బండి సంజయ్‌

కరీంనగర్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తమ అభ్యర్థి ఈటల రాజేందర్‌ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రజలు తమ పార్టీ సామర్థ్యాన్ని నమ్మి ఓట్లేయబోతున్నారని చెప్పారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్‌ ప్రజల్ని అయోమయానికి గురి చేయాలని తెరాస నేతలు చూస్తున్నారని ఆరోపించారు. దళితబంధు విషయంలో వాళ్లు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారన్నారు. అన్నపూర్ణగా తెలంగాణకు పేరుందని.. వరి పంట వేయొద్దని చెప్పేందుకు మీరెవరని అధికారులను ప్రశ్నించారు. యాసంగి, వానా కాలం పంట కేంద్ర ప్రభుత్వం కొనలేదా? ఈసారి కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. 

‘‘ముఖం చెల్లకే సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌ ఎన్నికల ప్రచారానికి రాలేదు. దళితబంధు 70 రోజులుగా ఎందుకు ఆపారని ప్రజలు నిలదీస్తారనే భయపడే రాలేదు. అధికారుల అండతో ఓటుకు రూ.20వేలు పంచడంతో తెరాస సక్సెస్‌ అయింది. విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది నిజాయతీగా వ్యవహరించాలి. హూజూరాబాద్‌ ఓట్లరు విజ్ఞతతో ఆలోచించి కేసీఆర్‌కు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలి. అహంకార, అవినీతి పాలనను తరిమికొడతామన్న ఉత్సాహాన్ని మాకివ్వండి’ అని బండి సంజయ్‌ ప్రజల్ని కోరారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని