Bandi sanjay: అసెంబ్లీలో ఆర్‌ఆర్‌ఆర్‌లు ప్రజాగళం వినిపిస్తారు: బండి సంజయ్‌

తాజా వార్తలు

Updated : 03/10/2021 19:28 IST

Bandi sanjay: అసెంబ్లీలో ఆర్‌ఆర్‌ఆర్‌లు ప్రజాగళం వినిపిస్తారు: బండి సంజయ్‌

హుజూరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో రాజాసింగ్‌, రఘునందన్‌రావు, రాజేందర్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)లు ప్రజాగళం వినిపిస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసిన భాజపా ఎన్నికల శంఖారావ సభలో బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. ఉద్యమకారుడైన ఈటల రాజేందర్‌ను గెలిపించాలని హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెరాస నేతలు ఈటలతో లబ్ధి పొంది చివరకు ఆయన్ను వదిలించుకున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌లో ఈటల గెలిస్తే కేసీఆర్‌ పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. తెరాస విషపూరిత ప్రచారాన్ని అందరూ గమనిస్తున్నారన్నారు. నకిలీ ఉత్తరాలు సృష్టిస్తూ .. దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెరాస కుతంత్రాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. భాజపా సభకు ఆపార్టీ శ్రేణులు భారీగా హాజరయ్యారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని