Huzurabad ByElection: అందుకే రాజీనామా చేసి మళ్లీ జనం ముందుకొచ్చాను: ఈటల

తాజా వార్తలు

Published : 17/10/2021 17:27 IST

Huzurabad ByElection: అందుకే రాజీనామా చేసి మళ్లీ జనం ముందుకొచ్చాను: ఈటల

హైదరాబాద్‌: గతంలో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అభివృద్ధిని గురించి ప్రశంసించిన వారే ఇప్పుడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని భాజపా నేత ఈటల రాజేందర్ విమర్శించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని పోతిరెడ్డిపేట, వెంకట్రావుపల్లిలో ప్రచారం నిర్వహించిన ఈటల.. తెరాస ప్రభుత్వ పాలనపై ఘాటు విమర్శలు చేశారు. గత 18 ఏళ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసినట్లు ఈటల చెప్పారు. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు విమర్శించడం విడ్డూరుంగా ఉందని మండిపడ్డారు. పదవులు, ప్రలోభాల కోసం విలువలు అమ్ముకోవడం తనకు సాధ్యం కాదని స్పష్టం చేశారు. అందుకే పదవికి రాజీనామా చేసి మళ్లీ జనం ముందుకు వచ్చినట్లు వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని