TS News: తెలంగాణ వచ్చి ఏడేళ్లయినా క్రీడా పాలసీ లేదు: రఘునందన్‌

తాజా వార్తలు

Published : 25/09/2021 14:33 IST

TS News: తెలంగాణ వచ్చి ఏడేళ్లయినా క్రీడా పాలసీ లేదు: రఘునందన్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఆవిర్భవించి ఏడేళ్లయినా ఇంత వరకూ రాష్ట్రానికి క్రీడా పాలసీ లేదని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం స్టేడియాలను ప్రైవేటు వ్యాపార సంస్థలకు ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు. భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గచ్చిబౌలి స్టేడియాన్ని టిమ్స్‌కు ఇవ్వడాన్ని భాజపా వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఈ విషయంపై మంగళవారం నుంచి ప్రత్యక్ష ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 

కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం కరెంటు బిల్లు కట్టకపోవడంతో క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారని.. ఐదేళ్ల నుంచి కోచ్‌లకు జీతాలు ఇవ్వడం లేదని రఘునందన్‌ ఆరోపించారు. మౌలిక సదుపాయాలు లేకపోతే మంచి క్రీడాకారులు ఎలా తయారవుతారని నిలదీశారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే సోమవారం అసెంబ్లీకి వచ్చే ముందు ఎల్బీ స్టేడియాన్ని పరిశీలించాలనికోరారు. క్రీడా పాలసీ, స్టేడియాల్లో మౌలిక సదుపాయాలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని