వైకాపా ద్వంద్వ వైఖరిని ఎండగట్టాలి: చంద్రబాబు

తాజా వార్తలు

Published : 17/07/2021 01:04 IST

వైకాపా ద్వంద్వ వైఖరిని ఎండగట్టాలి: చంద్రబాబు

అమరావతి: రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో పార్లమెంట్‌లో ఎంతవరకైనా పోరాడాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వైకాపా ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని పార్లమెంట్‌లో ఎండగట్టాలని సూచించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో పార్టీ ఎంపీలతో సమావేశమైన చంద్రబాబు 18 అంశాలపై చర్చించారు. ఈనెల 19 నుంచి జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు చేశారు. జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంతో రాష్ట్రంలో కరోనా విజృంభించి ప్రజలకు సరైన వైద్యం అందకపోవడం, కరోనా కోసం కేంద్రం కేటాయించిన నిధులు దారిమళ్లించడం, మృతుల సంఖ్యను తక్కువగా చూపడం, కరోనా ప్యాకేజీ ఇవ్వకపోవడం వంటి అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించాలన్నారు.

 సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి చేతులెత్తేసి లక్షలాదిమంది కరోనా బారినపడేలా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. విశాఖ ఉక్కు, రైతుల పంటలకు మద్దతు ధర, పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం వంటి అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించాలని ఎంపీలకు సూచించారు. ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్యాకేజీ, విభజన చట్టంలోని హామీల అమలులో  రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు ఆక్షేపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని