Ap News: ధ్వంసమైన సామగ్రి మధ్యే చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష

తాజా వార్తలు

Published : 20/10/2021 15:10 IST

Ap News: ధ్వంసమైన సామగ్రి మధ్యే చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష

అమరావతి: తెదేపా కార్యాలయాలపై దాడికి నిరసనగా నిరసన దీక్ష చేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. రేపు ఉదయం 8 గంటల నుంచి ఎల్లుండి రాత్రి 8 గంటల వరకు 36 గంటల పాటు ఆయన దీక్ష చేయనున్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ధ్వంసమైన సామగ్రి మధ్య చంద్రబాబు దీక్ష చేపట్టనున్నారు. నిన్న జరిగిన పరిణామాలపై పార్టీ ముఖ్యనేతలతో చర్చించిన అనంతరం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెదేపా కార్యాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి కొన్ని కీలకమైన అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరారు. శనివారం దిల్లీ వెళ్లి ఆయన్ను కలిసేందుకు సమయం అడిగారు. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి, రాష్ట్రంలో పరిణామాలపై అమిత్‌షాకు చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని