Chandrababu Naidu: అలాంటి వారికి సమాజంలో చోటు లేదు: చంద్రబాబు

తాజా వార్తలు

Published : 01/08/2021 14:32 IST

Chandrababu Naidu: అలాంటి వారికి సమాజంలో చోటు లేదు: చంద్రబాబు

అమరావతి: సాక్షులను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న జంట హత్యల నిందితులపై చర్యలు తీసుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు ఆయన లేఖ రాశారు. కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో జూన్ 17న వడ్డు నాగేశ్వర్ రెడ్డి, వడ్డు ప్రతాప్ రెడ్డిలను వైకాపా గూండాలు దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. వారి సోదరుడు మోహన్ రెడ్డికి నివాళులు అర్పించడానికి శ్మశానవాటికకు వెళ్లిన సమయంలో వైకాపా నాయకులు వారిని హత్య చేశారన్నారు. ఇలాంటి హింసాత్మక చర్యలకు, దాడులకు పాల్పడుతున్న వారికి సమాజంలో చోటు ఉండకూడదని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి నిందితులను ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. బాధితుల కుటుంబసభ్యులను, సాక్షులను బెదిరిస్తున్నారని.. తక్షణమే నిందితులను అరెస్టు చేసి సాక్షులకు రక్షణ కల్పించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని