CM Jagan: మాపై ప్రజల ప్రేమను విపక్షం జీర్ణించుకోలేకపోతోంది: జగన్‌

తాజా వార్తలు

Updated : 20/10/2021 16:17 IST

CM Jagan: మాపై ప్రజల ప్రేమను విపక్షం జీర్ణించుకోలేకపోతోంది: జగన్‌

అమరావతి: వైకాపా సర్కార్‌పై ప్రజల ప్రేమను విపక్షం జీర్ణించుకోలేకపోతోందని.. అందుకే దారుణమైన పరుష పదజాలంతో విమర్శలు చేస్తున్నారని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ‘జగనన్న తోడు’ వడ్డీ చెల్లింపు కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను అలా మాట్లాడలేదన్నారు. టీవీల్లో బూతులు విని భరించలేని అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా స్పందిస్తున్నారని వ్యాఖ్యానించారు. కులాలు, మతాల మధ్య విపక్షం చిచ్చు పెడుతోందన్నారు. కావాలనే వైషమ్యాలను రెచ్చగొట్టి తద్వారా లబ్ధిపొందాలనే ఆరాటం మన రాష్ట్రంలో కనిపిస్తోందన్నారు. అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని జగన్‌ విమర్శించారు. వ్యవస్థలను పూర్తిగా మేనేజ్‌ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు. జగన్‌కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో కోర్టు కేసులు వేయిస్తున్నారని విమర్శించారు. రెండున్నర ఏళ్లలో అందరినీ సంతృప్తి పరిచేలా పాలన చేశానని.. ఇకపైనా అలాగే కొనసాగిస్తానని జగన్‌ వివరించారు.

పారదర్శకంగా పథకాల అమలు

చిరు వ్యాపారులపై వడ్డీ భారం పడకుండా వాళ్ల కాళ్లపై వారు నిలబడేందుకే ‘జగనన్న తోడు’ కార్యక్రమం తీసుకొచ్చామని జగన్‌ అన్నారు. 9,50,458 మందికి రూ. 905 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని తెలిపారు. ‘‘సకాలంలో రుణాలు చెల్లించిన వారికి వడ్డీని విడుదల చేస్తున్నాం. ఏడాదిలో రెండు సార్లు ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించాం. ఇకపై ఏటా జూన్‌, డిసెంబర్లలో వడ్డీల చెల్లింపు, కొత్త రుణాలు ఇస్తాం. రుణాలు చెల్లింపుల్లో బకాయిలు ఉన్నవారు డిసెంబర్ నాటికి చెల్లించాలి. దీనిపై సందేహాల నివృత్తికి 08912890525 నెంబరుకు ఫోన్ చేయొచ్చు. పార్టీలకు అతీతంగా పారదర్శకంగా పథకాలను అమలు చేస్తున్నాం’’ అని జగన్‌ అన్నారు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని