Chinta Mohan: సీఎం జగన్‌ మాజీ కాబోతున్నారు: కాంగ్రెస్‌ నేత చింతామోహన్‌

తాజా వార్తలు

Updated : 02/08/2021 14:01 IST

Chinta Mohan: సీఎం జగన్‌ మాజీ కాబోతున్నారు: కాంగ్రెస్‌ నేత చింతామోహన్‌

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి రాజకీయ పతనం ప్రారంభమైందని.. రాష్ట్రంలో రాజకీయంగా మార్పు రాబోతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చింతామోహన్‌ అన్నారు. మరికొన్ని వారాల్లో సీఎం జగన్‌ మాజీ కాబోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తిరుపతిలో చింతా మోహన్‌ మీడియాతో మాట్లాడారు. జగన్‌ బెయిల్‌ రద్దు కేసులో సీబీఐ తీరు వివాదాస్పదంగా ఉందన్నారు. బెయిల్‌ కేసు నుంచి బయటపడేందుకు ఉత్తరాది పారిశ్రామిక వేత్త, కేంద్రమంత్రి కుమారుడి సాయాన్ని జగన్‌ కోరుతున్నారని చెప్పారు. తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్‌ను ఖండిస్తున్నట్లు చింతామోహన్‌ చెప్పారు. ఎంపీ రఘురామకృష్ణరాజును కొట్టడం తప్పన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని