Rahul Gandhi: విపక్షాల గొంతు నొక్కడం ప్రజాస్వామ్య హత్యే: రాహుల్‌గాంధీ

తాజా వార్తలు

Updated : 12/08/2021 12:45 IST

Rahul Gandhi: విపక్షాల గొంతు నొక్కడం ప్రజాస్వామ్య హత్యే: రాహుల్‌గాంధీ

దిల్లీ: సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ విపక్ష నేతలు దేశ రాజధానిలో ర్యాలీ చేపట్టారు. విజయ్‌ చౌక్‌ నుంచి పార్లమెంట్ వరకు ఫ్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 
పార్లమెంట్ సమావేశాలు సరిగా జరగలేదని.. దేశంలోని 60 శాతం మంది ప్రజలకు ఇదే అభిప్రాయం ఉందని రాహుల్‌ అన్నారు. ‘‘రాజ్యసభలో విపక్షాల గొంతు నొక్కారు. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే. రైతుల, ప్రజా సమస్యలపై చర్చించడానికి చట్టసభల్లో విపక్షాలకు అవకాశం ఇవ్వలేదు. అందుకే పార్లమెంట్‌ బయట మాట్లాడుతున్నాం’’ అని రాహుల్‌ అన్నారు.
రాజ్యసభలో బుధవారం జరిగిన ఘటనలను శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఖండించారు. మహిళా ఎంపీలపై తీసుకున్న చర్యలు ప్రజాస్వామ్య వ్యతిరేకం అని విమర్శించారు. అంతకముందు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో భేటీ అయిన విపక్ష పార్టీలు ఎగువ సభలో మహిళా ఎంపీలపై దాడి జరిగిందన్న ఆరోపణలపై చర్చించారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని