AP News: రాజకీయ ఉనికి కోసమే రెచ్చగొడుతున్నారు: శ్రీకాంత్‌రెడ్డి

తాజా వార్తలు

Published : 20/10/2021 12:28 IST

AP News: రాజకీయ ఉనికి కోసమే రెచ్చగొడుతున్నారు: శ్రీకాంత్‌రెడ్డి

అమరావతి: రాజకీయ ఉనికి కోసమే తెలుగుదేశం నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఓ పథకం ప్రకారమే నిన్న తెదేపా నేతలు వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. పట్టాభి వ్యాఖ్యలు.. నిన్న తెదేపా కార్యాలయాలపై దాడులు జరగడం తదితరాల నేపథ్యంలో ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు తనపై తరచూ విమర్శలు చేసినప్పుడు ఒపిగ్గా ఉండమని పార్టీ అధినేత తమకు చెప్పారని తెలిపారు. ఆ విమర్శలు, వ్యాఖ్యలను కార్యకర్తలు భరిస్తూ వచ్చారన్నారు. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నా సంయమనం పాటించారని.. వాటిని తారస్థాయికి తీసుకెళ్లినప్పుడు ఓపిక నశించి కొందరు ఆవేదన వ్యక్తం చేయడం సహజమని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. తెదేపా అధినేత చంద్రబాబు ప్రణాళిక ప్రకారమే పట్టాభితో ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయించారని ఆయన విమర్శించారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని