Ts news: హుజూరాబాద్‌ ఎన్నికల షెడ్యూల్‌పై కాంగ్రెస్‌ అభ్యంతరం

తాజా వార్తలు

Published : 29/09/2021 02:11 IST

Ts news: హుజూరాబాద్‌ ఎన్నికల షెడ్యూల్‌పై కాంగ్రెస్‌ అభ్యంతరం

హైదరాబాద్‌: ఈవీఎం, వీవీప్యాట్‌ల మొదటి స్థాయి తనిఖీల్లో గుర్తించిన అవకతవకలను సరిదిద్దకుండా హుజూరాబాద్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయడంపై చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌కు, రాష్ట్ర ఎన్నికల అధికారికి కాంగ్రెస్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ లేఖ రాశారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. ఈనెల 8న వీవీ ప్యాట్లు, ఈవీఎంల తనిఖీల్లో గుర్తించిన అవకతవకలను సరిదిద్దాలని డిమాండ్‌ చేశారు. ఆ తరువాతే ఈవీఎం, వీవీప్యాట్‌ల మొదటి స్థాయి తనిఖీలు తిరిగి నిర్వహించాలని కోరారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తూ.. అధికార పార్టీకి మద్దతుగా వ్యవహరించిన కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారిగా ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా ప్రస్తుత జిల్లా కలెక్టర్‌ తన బాధ్యతలను నిర్వహించలేరని ఆరోపించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నిర్వహణ కోసం మరో ఐఏఎస్‌ అధికారిని ఎన్నికల అధికారిగా నియమించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని