TS News: చలో రాజ్‌భవన్‌ ఉద్రిక్తం

తాజా వార్తలు

Updated : 16/07/2021 15:13 IST

TS News: చలో రాజ్‌భవన్‌ ఉద్రిక్తం

హైదరాబాద్‌: పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ‘చలో రాజ్‌భవన్‌’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఇందిరాపార్కు వద్ద ధర్నా అనంతరం రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు యత్నించాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీగా రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్‌ శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో రేవంత్‌ సహా నేతలు, కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

గవర్నర్‌ అందుబాటులో లేనందున ఆన్‌లైన్‌లో వినతిపత్రం అందజేయాలని పోలీసులు సూచించారు. అయితే అంబేడ్కర్‌ విగ్రహం వరకు తమ ర్యాలీని అనుమంతించాలని రేవంత్‌రెడ్డి కోరినప్పటికీ పోలీసులు అంగీకరించలేదు. దీంతో పోలీసులు, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తల సాయంతో రేవంత్‌ బారికేడ్లను దాటుకుంటూ ముందుకెళ్లారు. అనంతరం రేవంత్‌, మధుయాస్కీ సహా ముఖ్యనేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని