మధుయాష్కీ నివాసానికి దీపేందర్‌సింగ్‌

తాజా వార్తలు

Updated : 15/07/2021 18:13 IST

మధుయాష్కీ నివాసానికి దీపేందర్‌సింగ్‌

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ నివాసానికి ఏఐసీసీ సీనియర్‌నేత, రాజ్యసభ సభ్యుడు దీపేందర్‌సింగ్‌ హుడా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెళ్లారు. గతంలో పార్లమెంట్‌లో మంచి మిత్రులం కావడంతో దీపేందర్‌ సింగ్‌ను మర్యాదపూర్వకంగా తన నివాసానికి ఆహ్వానించినట్టు మధుయాష్కీ తెలిపారు.

అంతకుముందు గాంధీ భవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ నేతల సమావేశంలో దీపేందర్‌సింగ్‌ పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో దీపేందర్‌సింగ్‌, రేవంత్‌రెడ్డి, మధుయాష్కీ, షబ్బీర్‌ అలీ సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై నేతలు చర్చించినట్టు సమాచారం. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని