థర్డ్‌ ఫ్రంట్‌.. పెద్ద టాస్కే: సంజయ్‌ రౌత్‌

తాజా వార్తలు

Published : 15/07/2021 01:25 IST

థర్డ్‌ ఫ్రంట్‌.. పెద్ద టాస్కే: సంజయ్‌ రౌత్‌

ముంబయి: థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో భాజపాను ఎదుర్కొనేందుకు విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం పెద్ద వ్యవహారమేనని అభిప్రాయపడ్డారు. ప్రతి పార్టీ తమకు తాము గొప్ప అని భావించడం వల్లే ఈ సమస్య తలెత్తుతుందని చెప్పారు.

‘‘2024 ఎన్నికలకు అందరినీ ఒకేతాటిపైకి తీసుకురావడం పెద్ద టాస్క్‌. భాజపాను ఎదుర్కోవాలంటే ఇందిరా గాంధీ ఎదుర్కొన్న ఓ జయప్రకాశ్‌ నారాయణ్‌, రాజీవ్‌ గాంధీని ఎదుర్కొన్న ఓ వీపీ సింగ్‌, సోనియా- మన్మోహన్‌ను ఎదుర్కొన్న ఓ మోదీ లాంటి వ్యక్తులు కావాలి’’ అని రౌత్‌ అన్నారు. ప్రధాని అభ్యర్థిత్వం గురించి మాట్లాడుతూ.. ‘‘శరద్‌ పవార్‌ చాలా కాలంగా జాతీయ నేత. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో గెలుపుతో మమత అయితేనే బెటర్‌ అని కొందరు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రశాంత్‌ కిశోర్‌ ఏదైనా మ్యాజిక్‌ చేస్తే దానికి నేను సంతోషిస్తా’’ అని సమాధానమిచ్చారు. రాహుల్‌తో పీకే భేటీని ఆయన వ్యక్తిగత అంశం అని రౌత్‌ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని