Gorantla buchaiah chowdary: రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నా: గోరంట్ల

తాజా వార్తలు

Updated : 02/09/2021 17:51 IST

Gorantla buchaiah chowdary: రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నా: గోరంట్ల

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబుతో మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి భేటీ ముగిసింది. 40 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చించిన చంద్రబాబు గోరంట్ల గౌరవానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు. అనంతరం బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ... రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. ‘‘పార్టీలో నెలకొన్న కొన్ని పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్న మాట వాస్తవం. కానీ, ఎంతో మంది మిత్రులు, అభిమానులు రాజీనామా చేయొద్దని కోరారు. పార్టీకి సంబంధించి నా అభిప్రాయాలను చంద్రబాబుకు స్పష్టంగా చెప్పా. కార్యకర్తల మనోభావాలను అధినేతకు వివరించాను.

పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం జరగాలి. పార్టీలో లోటుపాట్లు ఏమైనా ఉంటే చర్చించుకుంటాం.. సరిదిద్దుకుంటాం. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. ప్రజలను చైతన్యవంతులను చేసి ఉద్యమబాటలోకి తీసుకెళ్లాల్సిన అవసరముంది. 40 ఏళ్లుగా పార్టీలో ఉన్నా.. ఉన్నంతకాలం పార్టీకి సేవ చేస్తా. నాకు అండగా నిలిచిన నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. స్థానికంగా ఉన్న సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లా. ఎవరినీ బెదిరించడానికో, పదవుల కోసం నేను అసంతృప్తి వ్యక్తం చేయలేదు. పార్టీ కోసమే నా తపనంతా’’ అని బుచ్చయ్య చౌదరి వివరించారు. గోరంట్ల వెంట పార్టీ నేతలు చిన రాజప్ప, నల్లమిల్లి, గద్దె రామ్మోహన్‌, జవహర్‌ తదితరులు ఉన్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని