Huzurabad By poll: గోబెల్స్‌ ప్రచారంతో లబ్ధిపొందాలని చూస్తున్నారు: హరీశ్‌రావు

తాజా వార్తలు

Published : 17/10/2021 01:42 IST

Huzurabad By poll: గోబెల్స్‌ ప్రచారంతో లబ్ధిపొందాలని చూస్తున్నారు: హరీశ్‌రావు

హుజురాబాద్‌: భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ గోబెల్స్‌ ప్రచారం చేస్తూ లబ్ధిపొందే యత్నం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. హుజురాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈటల భాజపా అనే బరుదలో దిగి తనకు మాత్రం బురద అంటకుండా జాగ్రత్త పడుతున్నారని అన్నారు. భారత్‌ మాతాకీ జై అని, జైశ్రీరాం అన్న నినాదాలు కూడా చేయడం లేదని ఎద్దేవా చేశారు. భాజపా అన్న బురదలో దిగిన తర్వాత బురద అంటొద్దంటే ఎలా అని ప్రశ్నించారు. గత ఏడేళ్ల భాజపా పాలనను చూసి ఓట్లేయాలని అడగమని సలహా ఇచ్చారు. ‘‘మేం మా అభివృద్ధి గురించి చెప్పి ఓట్లు అడుగుతున్నాం. ఇప్పటి వరకు ఐదు అంశాలపై సవాల్‌ విసిరితే సమాధానం చెప్పకుండా రోజుకు ఒక కొత్త ఆరోపణ చేస్తున్నారు. ప్రజా స్వామ్యంలో మీరు చేసే అభివృద్ధి ఏమిటో చెప్పి ఓట్లు అడగాలే తప్ప అబద్దాల పునాదులపై ప్రచారం చేయకూడదు. భాజపా అవలంభిస్తున్న విధానాల వల్ల అనేక రాష్ట్రాల్లో కరెంటు కోతలు మొదలయ్యాయి. గుజరాత్‌లోనూ కరెంట్‌ కోతలు మొదలయ్యాయి’’ అని హరీశ్‌రావు ఆరోపించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని