Bandi sanjay: సామాన్యులకు భద్రత కల్పించలేని హోం మంత్రి: బండి సంజయ్‌

తాజా వార్తలు

Updated : 13/09/2021 20:02 IST

Bandi sanjay: సామాన్యులకు భద్రత కల్పించలేని హోం మంత్రి: బండి సంజయ్‌

మెదక్‌: సామాన్యులకు భద్రత కల్పించలేని హోం మంత్రి రాజీనామా చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర 17వ రోజు మెదక్‌ జిల్లా చిన్న ఘన్‌పూర్‌లో కొనసాగుతోంది. సైదాబాద్‌లో చిన్నారి హత్యాచార ఘటనపై బండి సంబయ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ‘‘పసిపాపపై హత్యాచారం చేసిన ఘటనకు నైతిక బాధ్యత వహించి హోంమంత్రి మహమూద్‌ అలీని సీఎం రాజీనామా చేయించాలి. ఒక వర్గానికే కొమ్ముకాసే హోం మంత్రి రాష్ట్రానికి అవసరం లేదు’’ అని బండి సంజయ్‌ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. సంజయ్‌ పాదయాత్రకు ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ హాజరయ్యారు. ఆయనను భాజపా శ్రేణులు గజమాలతో సత్కరించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని