కాంగ్రెస్‌ ‘చలో రాజ్‌భవన్‌’కు అనుమతి నిరాకరణ

తాజా వార్తలు

Updated : 16/07/2021 10:33 IST

కాంగ్రెస్‌ ‘చలో రాజ్‌భవన్‌’కు అనుమతి నిరాకరణ

హైదరాబాద్‌: పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ‘చలో రాజ్‌భవన్‌’ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇందిరాపార్కు వద్ద 200 మందితో సమావేశమయ్యేందుకు మాత్రమే అనుమతిచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపుతో చలో రాజ్‌భవన్‌ కార్యక్రమానికి బయల్దేరుతుండగా పలుచోట్ల ఆ పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా ఇళ్ల వద్దే నిర్బంధించారు. కార్యకర్తలు తరలివెళ్లకుండా కట్టడి చేస్తున్నారు.  మరోవైపు కొంతమంది కాంగ్రెస్‌ కార్యకర్తలు రాజ్‌భవన్‌ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. రాజ్‌భవన్‌ మెయిన్‌ గేటుకు పార్టీ జెండాలు తగిలించి ఆందోళన చేశారు.

అక్రమ అరెస్టులు నియంతృత్వం: మల్లు రవి

చలో రాజ్‌భవన్‌ కార్యక్రమానికి వస్తున్న నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేశారని.. అది నియంతృత్వమని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి మండిపడ్డారు. జిల్లాల నుంచి కార్యకర్తలు రాకుండా అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరాపార్కు వద్ద ధర్నా చేసేందుకు అనుమతి ఇచ్చిన పోలీసులు.. ఇలా గృహ నిర్బంధాలు, అరెస్టులు చేయడం రాచరిక పాలకకు నిదర్శనమని ఆక్షేపించారు. అరెస్ట్‌ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని