ఈటల రాజేందర్‌ పాదయాత్ర ప్రారంభం

తాజా వార్తలు

Updated : 19/07/2021 10:45 IST

ఈటల రాజేందర్‌ పాదయాత్ర ప్రారంభం

కమలాపూర్‌: మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ ‘ప్రజాదీవెన పాదయాత్ర’ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రారంభమైంది. కమలాపూర్‌ మండలం బత్తినవారిపల్లె నుంచి ఆయన పాదయాత్రగా బయలుదేరారు. అంతకముందు ఈటల సతీమణి జమున, మాజీ జడ్పీ ఛైర్మన్‌ తుల ఉమ వీరతిలకం దిద్ది మంగళహారతులు ఇచ్చారు. కార్యక్రమంలో భాజపా నేతలు వివేక్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మొదటి రోజు నియోజకవర్గంలోని మాదన్నపేట, గునిపర్తి, శ్రీరాములపేట, అంబల గ్రామాల మీదుగా ఈటల పాదయాత్ర చేస్తారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో 23 రోజుల పాటు ఆయన పాదయాత్ర చేయనున్న విషయం తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని