AP politics: రఘువీరా, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆత్మీయ కలయిక

తాజా వార్తలు

Published : 02/08/2021 01:12 IST

AP politics: రఘువీరా, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆత్మీయ కలయిక

మడకశిర: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు. ఒకప్పుడు జేసీ సోదరులు, రఘువీరారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత జేసీ సోదరులు తెదేపాలో చేరగా.. రఘువీరారెడ్డి కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. ఆ తర్వాత రఘువీరా పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. పలు సందర్భాల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి, రఘువీరా మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. అయితే, గత కొన్నేళ్లుగా రఘువీరారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. స్వగ్రామం నీలకంఠాపురంలోనే ఉంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జేసీ ప్రభాకర్‌రెడ్డి... రఘువీరారెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది.

అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డిని తాడిపత్రి మన్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆత్మీయంగా కలిశారు. గ్రామంలో రఘువీరా కుటుంబ సభ్యులు నిర్మించిన నూతన ఆలయాలను రఘువీరాతో కలిసి సందర్శించారు. అనంతరం స్వామివారి పూజ, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి పార్టీ జెండాతో కాకుండా కేవలం అజెండాతో మిత్రుడు, శత్రువు అనే తేడా లేకుండా రాయలసీమలోని అందరు నాయకులను కలుస్తున్నట్టు చెప్పారు. ఈ అజెండాలో విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. అందులో భాగంగానే రఘువీరారెడ్డిని కలిశానని, ఆయన నిర్మించిన దేవాలయాలను దర్శించుకున్నాని చెప్పారు. రాయలసీమ నీటి విషయంలో అజెండా గురించి వివరించారని.. ఆయన పూర్తిగా విన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో రఘువీరా నిర్ణయం వెలువడుతుందని ప్రభాకర్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని