AP Politics: నిరసన తెలిపేందుకు వెళితే.. దండయాత్ర అంటున్నారు: జోగి రమేశ్‌

తాజా వార్తలు

Updated : 18/09/2021 14:05 IST

AP Politics: నిరసన తెలిపేందుకు వెళితే.. దండయాత్ర అంటున్నారు: జోగి రమేశ్‌

అమరావతి: తెదేపా నేత అయ్యన్న సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలపై బాధ కలిగి నిరసన తెలిపేందుకు తెదేపా అధినేత చంద్రబాబు నివాసానికి వెళితే దండయాత్ర అంటున్నారని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్‌ అన్నారు. చంద్రబాబును కలిసి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వెళ్లానని ఆయన తెలిపారు. తన వెంట వైకాపా పార్టీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారని చెప్పారు.

‘‘నా కారు అద్దాలు పగులగొట్టారు. ఘటనపై చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందే. అయ్యన్న వ్యాఖ్యలపై బాధ కలిగి నిరసన తెలపడానికి వెళ్తుండగానే నా కారుపై రాళ్లేశారు. నిరసన తెలిపే హక్కు కూడా లేదా? సీఎంపై అనుచిత వ్యాఖ్యల పట్ల చంద్రబాబు స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలుపుతాం. అయ్యన్నపాత్రుడు మళ్లీ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు’’ అని రమేశ్‌ అన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని