Congress: సీఎం కేసీఆర్‌కు కిసాన్‌ కాంగ్రెస్‌ బహిరంగ లేఖ

తాజా వార్తలు

Published : 26/09/2021 17:47 IST

Congress: సీఎం కేసీఆర్‌కు కిసాన్‌ కాంగ్రెస్‌ బహిరంగ లేఖ

హైదరాబాద్‌: రైతాంగం, వ్యవసాయ సమస్యలపై అసెంబ్లీలో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కిసాన్‌ కాంగ్రెస్‌ బహిరంగ లేఖ రాసింది. పీసీసీ కిసాన్‌ కాంగ్రెస్‌ ఛైర్మన్‌ అన్వేష్‌రెడ్డి ఈ లేఖను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు కూడా రాశారు. ప్రధానంగా రుణమాఫీ, పంటల బీమా, పంట నష్టపరిహారం, ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలు, సబ్సిడీల ఎత్తివేత, భూ రికార్డుల ప్రక్షాళన, ధరణి, అన్నదాతల ఆత్మహత్యలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం, మొక్కజొన్న పంటతో సహా పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, చెరకు రైతుల  సమస్యలు, వరిసాగు నియంత్రణ, బ్యాంకుల నుంచి పంటరుణాలు అందని వైనం, తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చించాలని విజ్ఞప్తి చేశారు. గణాంకాలతో సహా తాజా పరిస్థతితులను ప్రతిబింబించే విధంగా ఏడు పేజీలతో కూడిన లేఖను కిసాన్‌ కాంగ్రెస్‌ సీఎంకు పంపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని