KTR: తెరాస జిల్లా కమిటీలు, ప్లీనరీపై త్వరలో నిర్ణయం: కేటీఆర్‌

తాజా వార్తలు

Published : 22/09/2021 21:23 IST

KTR: తెరాస జిల్లా కమిటీలు, ప్లీనరీపై త్వరలో నిర్ణయం: కేటీఆర్‌

హైదరాబాద్‌: తెరాస జిల్లా కమిటీలు, ప్లీనరీపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు  తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు వెల్లడించారు. సంస్థాగత కమిటీల నిర్మాణంపై పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్‌ ఇవాళ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా అధ్యక్షులను త్వరలో సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తారని తెలిపారు. గ్రామ, మండల కమిటీలు పూర్తయ్యాయని ఎమ్మెల్యేలు కేటీఆర్‌కు తెలిపారు. ఇంకా ఎక్కడైనా మిగిలి ఉంటే రేపటికల్లా  పూర్తి చేయాలని సూచించారు. ఈనెల 24 నుంచి ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు కాబట్టీ, ఎల్లుండి లోగా కమిటీల వివరాలన్నీ రాష్ట్ర కార్యాలయానికి పంపించాలని కేటీఆర్‌ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని