Telangana Politics: కేసీఆర్‌ ప్రజలను మభ్యపెడుతున్నారు: మధుయాష్కీ గౌడ్‌

తాజా వార్తలు

Updated : 19/08/2021 14:58 IST

Telangana Politics: కేసీఆర్‌ ప్రజలను మభ్యపెడుతున్నారు: మధుయాష్కీ గౌడ్‌

హైదరాబాద్: రాష్ట్రంలోని దళిత, గిరిజనులను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేసి నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్‌ ఆరోపించారు. కేసీఆర్ చేసిన నమ్మక ద్రోహాన్ని ప్రజలందరికీ వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ అడ్డగోలుగా సంపాదించిన డబ్బులతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. పార్టీ కార్యకర్తలంతా దళితులు, గిరిజనుల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. అర్హులకు డబుల్ బెడ్ రూం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, విద్య, వైద్యం లాంటివి ఇవ్వగలిగితే దళిత బంధు అవసరం ఉండేదా? అని ప్రశ్నించారు. దళితబంధు పథకం అమలుకు రూ.1.70 లక్షల కోట్లు అవసరమని.. అంత మొత్తం నిధులు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చగలదా?అని ప్రశ్నించారు. ఈ అంశంపై రాజకీయంగా ప్రజలను చైతన్యవంతులను చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని