Ts News: కేసీఆర్‌ను ఓడిస్తేనే పీడిత ప్రజలకు భవిష్యత్తు: మందకృష్ణ
close

తాజా వార్తలు

Published : 22/07/2021 17:54 IST

Ts News: కేసీఆర్‌ను ఓడిస్తేనే పీడిత ప్రజలకు భవిష్యత్తు: మందకృష్ణ

హైదరాబాద్: దళితుల్లో ఐక్యత లోపం, రాజ్యాధికారం చేపట్టాలనే చైతన్యం లేకపోవడంతోనే వెనక్కి నెట్టివేయబడుతున్నామని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిక అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్‌ను ఓడిస్తేనే పీడిత ప్రజలకు భవిష్యత్తు ఉంటుందన్నారు. దళితులను మోసం చేసేందుకే మేనిఫెస్టోలో మూడెకరాల భూమి పంపిణీ అంశాన్ని పొందుపరిచారని.. ఏడేళ్ల పాలనలో ఏడు వేల మందికి కూడా భూమి పంపిణీ చేయలేదని ఆక్షేపించారు. దళితుల ఆత్మగౌరవాన్ని సీఎం కేసీఆర్‌ చంపుతున్నారని విమర్శించారు. పంచిన భూమి కంటే దళితులకు చెందిన భూమిని 15 రేట్లకు పైగా కేసీఆర్ లాక్కున్నారన్నారు. దళితుల భూముల్లో తెరాస జిల్లా కార్యాలయాలు, కలెక్టరేట్లు, స్మశానవాటికలు, రైతు వేదికలు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని