Mansas Trust: బెయిల్‌పై వచ్చిన పెద్దలకు జైలు అంటే ఇష్టమేమో : అశోక్‌గజపతిరాజు

తాజా వార్తలు

Published : 04/09/2021 01:21 IST

Mansas Trust: బెయిల్‌పై వచ్చిన పెద్దలకు జైలు అంటే ఇష్టమేమో : అశోక్‌గజపతిరాజు

విజయనగరం: మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌, బోర్డు సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని నియమించినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కాకపోతే ట్రస్టు ఆనవాయితీలను పాటించే విషయంలో అడ్డు రాకూడదని ట్రస్టు ఛైర్మన్‌ అశోక్‌ గజపతిరాజు స్పష్టం చేశారు. విజయనగరంలో ఆయన  మీడియాతో మాట్లాడుతూ... ట్రస్టు బోర్డు సభ్యులుగా అందరూ మహిళలనే తీసుకుంటే ఎవరైనా కాదన్నారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్టు బోర్డులకు తాము ఏమాత్రం వ్యతిరేకం కాదన్నారు. ట్రస్టు పేరు చెప్పి కొంత మంది తెదేపా నేతలను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో? ఎందుకు విడిచిపెట్టారో? ఇప్పటికీ ప్రశ్నగానే ఉందన్నారు. ట్రస్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అర్థరహితంగా ఉందని ఆక్షేపించారు. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేనటువంటి ట్రస్టుపై ఎందుకు దృష్టి పెట్టారో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. ‘‘వైకాపా అధికారంలోకి రాగానే ట్రస్టు భూములపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు అనిపిస్తుంది. ఎప్పుడు మాట్లాడినా నన్ను జైలుకు పంపిస్తానని అంటున్నారు. బహుశా బెయిల్‌పై వచ్చిన పెద్దలకు జైలు అంటే చాలా ఇష్టం అనుకుంటా. అలా అనే నేను భావించాల్సి వస్తోంది’’ అని అశోక్‌ గజపతిరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని