AP News: తెదేపా జాతీయ పార్టీ ఎలా అయిందో ఎవరికీ తెలియదు: కన్నబాబు

తాజా వార్తలు

Updated : 23/10/2021 13:37 IST

AP News: తెదేపా జాతీయ పార్టీ ఎలా అయిందో ఎవరికీ తెలియదు: కన్నబాబు

గుంటూరు: ఏపీలో అశాంతి సృష్టించాలని తెదేపా చూస్తోందని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెదేపా అధినేత చంద్రబాబు చేసిన 36 గంటల దీక్షలో ఆ పార్టీ నేతల చేత సీఎంను తిట్టించారన్నారు. తెదేపా జాతీయ పార్టీ ఎలా అయిందో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. బద్వేలు, హుజూరాబాద్‌లో తెదేపా ఎందుకు పోటీ చేయట్లేదని ప్రశ్నించారు. సీఎంను తిట్టిన పదంతో రాష్ట్రపతి, ప్రధానిని సంబోధించగలరా అని కన్నబాబు నిలదీశారు. సీఎం జగన్‌పై బురద జల్లేందుకే చంద్రబాబు దిల్లీ పర్యటన అని ఆరోపించారు. సంక్షేమ పథకాలు అడ్డుకునే ఉగ్రవాదం తెదేపా చేస్తోందని ఆయన మండిపడ్డారు. వ్యవసాయశాఖలో ఏ సంస్థనూ మూసివేయట్లేదని స్పష్టం చేశారు. ఆగ్రోస్‌ సంస్థ మూతపడదని చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణ మరింత బతోపేతం చేస్తామని కన్నబాబు వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని