కార్యకర్తల కుటుంబాలకు కేసీఆర్‌ పెద్దదిక్కుగా ఉంటారు: కేటీఆర్‌

తాజా వార్తలు

Published : 05/08/2021 01:48 IST

కార్యకర్తల కుటుంబాలకు కేసీఆర్‌ పెద్దదిక్కుగా ఉంటారు: కేటీఆర్‌

హైదరాబాద్‌: కార్యకర్తల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ పెద్ద దిక్కుగా ఉంటారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. మరణించిన తెరాస కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున చెక్కులను అందించిన కేటీఆర్‌ .. తన దృష్టికి తెచ్చిన సమస్యలను 15 రోజుల్లో  పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యకర్తల కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలో మరింత కష్టపడి పనిచేద్దామని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. 60 లక్షల సభ్యత్వం కలిగిన అజేయశక్తిగా తెరాస పార్టీ ఎదిగిందన్నారు. 60 లక్షల మంది కుటుంబ సభ్యులు టీఆర్‌ఎస్‌ పార్టీ కుటుంబమేనన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని