TS News: దేశానికే ఆదర్శంగా విజయ డెయిరీ: మంత్రి తలసాని 

తాజా వార్తలు

Updated : 05/10/2021 13:49 IST

TS News: దేశానికే ఆదర్శంగా విజయ డెయిరీ: మంత్రి తలసాని 

హైదరాబాద్‌: విజయ డెయిరీని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో మంత్రి మాట్లాడారు.  మెగా డెయిరీ  ప్రాజెక్టుల ఏర్పాటుపై ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, ప్రభాకర్‌రావు అడిగిన ప్రశ్నలకు తలసాని సమాధానమిచ్చారు. కరీంనగర్‌ జిల్లా పాడి రైతులకు రూ.4 ప్రోత్సాహకం అందడం లేదని జీవన్‌రెడ్డి మండలి దృష్టికి తీసుకొచ్చారు. 

కరీంనగర్‌, ముల్కనూరు, నల్గొండ పాడి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే 50 శాతం రాయితీతో పాడి పశువులను పంపిణీ చేస్తున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో పాల సేకరణ లక్ష లీటర్ల నుంచి నాలుగున్నర లక్షల లీటర్లకు పెంచామన్నారు. 35వేలుగా ఉన్న పాడిరైతుల సంఖ్య.. తెరాస పాలనలో 1.32లక్షలకు చేరిందన్నారు. రావిర్యాల ప్రాంతంలో మెగా డెయిరీని ప్రారంభిస్తున్నామని తలసాని వివరించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని