Raghunandan Rao: హరీశ్‌రావు మానవత్వం మరిచి మాట్లాడుతున్నారు: రఘునందన్‌

తాజా వార్తలు

Published : 03/08/2021 18:22 IST

Raghunandan Rao: హరీశ్‌రావు మానవత్వం మరిచి మాట్లాడుతున్నారు: రఘునందన్‌

హైదరాబాద్‌: మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌పై  మానవత్వం లేకుండా ఆరోపణలు చేస్తున్నారంటూ భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈటల రాజేందర్‌కు ఆస్పత్రిలో ఆపరేషన్‌ జరిగితే.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న హరీశ్‌రావు మానవత్వం మర్చిపోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో రఘునందన్‌ మీడియాతో మాట్లాడారు. డ్రామాకు పర్యాయపదమే తెరాస అని వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా కేసీఆర్‌ దీక్ష చేసిన సమయంలో అసలు డ్రామా చేసిందే హరీశ్‌రావు అని వ్యాఖ్యానించారు. 

తెలంగాణ ఉద్యమ సమయంలో పొద్దున్న అల్లుడు, సాయంత్రం మామ.. ఆడిన డ్రామాలో యువత బలి అయ్యారని విమర్శించారు. కౌశిక్ రెడ్డికి ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాటం చేసి ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి ఎక్కడికి పోయిందని నిలదీశారు. కాంగ్రెస్, తెరాస రెండూ కవల పిల్లల్లాంటివని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ సమావేశాల కారణంగా బండి సంజయ్‌ యాత్ర వాయిదా పడిందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత ఎవరి భవిష్యత్‌ ఏంటో తేలుతుందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని