Rahul Gandhi: ప్రైవేటీకరణకు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదు..!

తాజా వార్తలు

Published : 03/09/2021 02:01 IST

Rahul Gandhi: ప్రైవేటీకరణకు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదు..!

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డ రాహుల్‌ గాంధీ

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రస్తుతం దేశం సంకట స్థితిని ఎదుర్కొంటోందని కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. దేశంలో ఆర్థికవ్యవస్థను కేంద్ర ప్రభుత్వం అసమర్థంగా నిర్వహిస్తోందని ఆరోపించారు. బాధ్యతాయుత ప్రతిపక్ష పార్టీగా ఇలాంటి చర్యలను వ్యతిరేకిస్తూనే.. దేశానికి ముప్పుగా మారే ప్రభుత్వ నిర్ణయాలపై కాంగ్రెస్‌ తరపున పోరాటం కొనసాగిస్తామని అన్నారు.

‘దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ ప్రభుత్వం పూర్తి అసమర్థంగా నిర్వహిస్తోంది. గడిచిన ఏడు దశాబ్దాల్లో దేశం నిర్మించుకున్న వనరులను తన కొంతమంది మిత్రులకు మోదీజీ ఇచ్చేస్తున్నారు’ అని కేరళలో డీసీసీ కార్యవర్గం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ప్రైవేటీకరణకు కాంగ్రెస్‌ ఎప్పుడూ వ్యతిరేకం కాదన్న ఆయన.. గతంలో న్యాయబద్ధమైన, తర్కంతో కూడిన ప్రణాళికను అనుసరించామని చెప్పారు. కానీ, దేశానికి వెన్నెముకగా ఉన్న రైల్వేలను ప్రైవేటుపరం చేయలేదన్నారు. విలువైన దేశ సంపదను అమ్మకానికి పెట్టిన ఇలాంటి వాటిపై కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతూనే ఉంటుందని నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ (NMP) ప్రణాళికపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఇక దేశంలో పెట్రోల్‌, డీజిల్‌తో పాటు వంట గ్యాస్‌ ధరలు రోజురోజుకీ పెరుగుతుండడంపై రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వీటి ధరలను పెంచడం ద్వారా గత ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.23లక్షల కోట్లు అర్జించిందని.. ఈ డబ్బంతా ఎక్కడికి పోతోందని ప్రశ్నించారు. ఇదిలాఉంటే, కేరళ కాంగ్రెస్‌ నాయకులతో వర్చువల్‌ పద్ధతిలో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సీనియర్‌ నేతలు ఊమెన్‌ చాందీ, రమేష్‌ చెన్నితల.. ఇతర రాష్ట్ర నేతలు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని