Motkupally Narsimhulu: పాదయాత్రలు, సభలు చూస్తుంటే విడ్డూరంగా ఉంది: మోత్కుపల్లి

తాజా వార్తలు

Published : 30/08/2021 01:24 IST

Motkupally Narsimhulu: పాదయాత్రలు, సభలు చూస్తుంటే విడ్డూరంగా ఉంది: మోత్కుపల్లి

హైదరాబాద్‌: ప్రతిపక్షాల దగ్గర నీతి లేదని.. ఒక్కసారిగా దళితులపై ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు దళితబంధును వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ బేగంపేటలోని ఆయన నివాసంలో తలపెట్టిన ఒక్కరోజు దీక్షను మోత్కుపల్లి విరమించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దళితుల కోసం పాదయాత్రలు చేయడం, సభలు నిర్వహించడం చేస్తుంటే విడ్డూరంగా ఉందన్నారు. తెదేపాలో ఉన్నప్పుడు మల్లారెడ్డి నుంచి డబ్బు తీసుకున్నవా? లేదా? అని రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణలో తెదేపాకు పట్టిన గతే కాంగ్రెస్‌కూ పడుతుందన్నారు. దళితబంధు అమలుతో విపక్ష నేతల గుండెల్లో వణుకు పుట్టిందన్నారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ ఓడిపోవడం ఖాయమని చెప్పారు. దళిత బంధును వ్యతిరేకించినా.. అమలును అడ్డుకునే ప్రయత్నం చేసినా సహించేది లేదని మోత్కుపల్లి తేల్చి చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని