AP News: అప్పుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు: జీవీఎల్‌

తాజా వార్తలు

Updated : 25/07/2021 15:55 IST

AP News: అప్పుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు: జీవీఎల్‌

దిల్లీ: ఏపీ అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారిందనే విషయం దేశం మొత్తం తెలిసిందని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. కొత్త అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రోజూ ప్రయత్నాలు చేసే పరిస్థితి ఉందని చెప్పారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీకి చెందిన పలు అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఏపీలో అప్పులకోసమే ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ ఎస్‌డీసీ)ఏర్పాటు చేసినట్టుందని.. అది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించేలా ఉందన్నారు. ఈ అంశంపై కేంద్రమంత్రి దృష్టికి తెస్తానని చెప్పారు. అప్పులు చేయడం, రాజ్యాంగ ఉల్లంఘనలపై కేంద్రమంత్రికి చెబుతానన్నారు. ఎస్‌డీసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సవరణలు చేయాలని జీవీఎల్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అప్పుల మంత్రిగా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. రోజూ కొత్త అప్పుల కోసం పడరాని పాట్లు పడుతున్నారని.. ఏపీ అప్పులపై కాగ్‌, ఆర్బీఐతో ఆడిట్‌ చేయాలని కేంద్రాన్ని కోరతానని జీవీఎల్‌ చెప్పారు.

‘‘పింఛన్లు, జీతాలు ఇవ్వలేని స్థితిలోకి వచ్చింది. ఓటు బ్యాంకు కోసం, పథకాల కోసం రుణాలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులు చూసుకుని నిధుల సమీకరణతో పథకాలు అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై కేంద్రానికి సూచనలు చేస్తాను. అప్పులు చేయడం ఆపేలా కేంద్రం సూచనలు చేయాలని కేంద్రాన్ని కోరతాను. పార్లమెంట్‌లోనూ ఈ అంశాన్ని ప్రస్తావిస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేస్తే కుదరదు. ప్రభుత్వం చేసే అప్పుల భారం చివరికి ప్రజలపైనే పడుతుంది. ఏపీ ఆర్థిక వ్యవస్థ పతనం వైకాపా పతనానికి నాంది కాబోతోంది. ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలి’’ అని జీవీఎల్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని