ap News: గతంలో జగన్‌ వాడిన భాష జుగుప్సాకరం: కనకమేడల

తాజా వార్తలు

Published : 29/10/2021 02:08 IST

ap News: గతంలో జగన్‌ వాడిన భాష జుగుప్సాకరం: కనకమేడల

దిల్లీ: గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌.. చంద్రబాబుపై వాడిన భాష జుగుప్సాకరమని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు. గురువారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైకాపా నేతల తీరును తప్పుబట్టారు. ‘‘ భాష గురించి ఇప్పుడు జగన్‌ మాట్లాడటం దౌర్భాగ్యం. చంద్రబాబుపై మంత్రులు ఇష్టారీతిన మాట్లాడారు. ఇలాంటి భాష, సంస్కృతికి వైకాపానే కారణం. తెదేపా కార్యాలయంపై పోలీసులే దగ్గరుండి దాడి చేయించారు. కానీ, దాడి చేసిన వారిపై బెయిలబుల్‌ కేసులు పెట్టి, తెదేపా నేతలపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టారు. చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించిన వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్‌ను డీజీపీ వెనకేసుకొచ్చారు. చంద్రబాబుతో చర్చించడానికి జోగి రమేశ్‌ వచ్చారని డీజీపీ చెప్పుకొచ్చారు.  పరుష వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ గుర్తింపు రద్దు చేయాల్సి వస్తే... మొదట వైకాపా గుర్తింపు రద్దు చేయాల్సి ఉంటుంది’’ అని కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని