Raghurama: అన్నీ తెలిసి నాకెందుకు టికెట్‌ ఇచ్చారు?

తాజా వార్తలు

Published : 24/07/2021 15:17 IST

Raghurama: అన్నీ తెలిసి నాకెందుకు టికెట్‌ ఇచ్చారు?

దిల్లీ: నేర చరిత్ర కలిగిన ఇద్దరు వ్యక్తులు తనపై ఆరోపణలు చేస్తూ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీకి లేఖలు రాశారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రూ.42 వేల కోట్లు దోచుకున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న వారు తనపై ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. జులై 26న సీబీఐ కోర్టులో అన్ని విషయాలు తేలిపోతాయన్నారు. దొంగలంతా కలిసి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై తమిళనాడులో నమోదైన కేసుకు సీఎం జగన్‌, బాలశౌరి కారణమని పేర్కొన్నారు. తన గురించి అన్నీ తెలిసి పార్టీ టికెట్‌ ఎందుకు ఇచ్చారని నిలదీశారు. ఒకరు 16నెలలు జైల్లో ఉండి.. పదేళ్లుగా బెయిల్‌పై ఉంటున్నారని.. మరోవైపు ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖను లూటీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి సంబంధించి అన్ని విషయాలు పక్కనబెట్టి తనపై అనర్హత వేటు వేయాలని అడుగుతున్నారని ఆక్షేపించారు. ఈ అంశంపై రాష్ట్రపతి, ప్రధానికి వివరంగా లేఖ రాస్తానన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని