Nara Lokesh: గుంటూరులో నారా లోకేశ్‌ అరెస్ట్‌

తాజా వార్తలు

Updated : 16/08/2021 14:14 IST

Nara Lokesh: గుంటూరులో నారా లోకేశ్‌ అరెస్ట్‌

గుంటూరు: హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వచ్చిన సందర్భంగా గుంటూరులోని పరమయ్యగుంట వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాజకీయ లబ్ధికోసమే లోకేశ్‌ వచ్చారంటూ వైకాపా శ్రేణులు అక్కడికి చేరుకుని ఆరోపించాయి. ఈ క్రమంలో తెదేపా-వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

పోటాపోటీ నినాదాలతో శ్రేణులు ఆరోపణలు చేసుకున్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నాలు చేపట్టారు. అనంతరం లోకేశ్‌తో పాటు మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్‌ చేశారు. లోకేశ్‌ను ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మిగతా నేతలను వివిధ ప్రాంతాల్లోని స్టేషన్లకు తీసుకెళ్లారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని