Nara lokesh: ఇప్పుడు దాడి చేసిన వారికి వడ్డీతో సహా వడ్డిస్తాం: లోకేశ్‌

తాజా వార్తలు

Published : 18/09/2021 01:03 IST

Nara lokesh: ఇప్పుడు దాడి చేసిన వారికి వడ్డీతో సహా వడ్డిస్తాం: లోకేశ్‌

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన వారికి వడ్డీతో సహా వడ్డిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీ అధినేత ఇంటిపైకి ఎమ్మెల్యేని, గూండాలని పంపించి.. సీఎం జగన్ దిగజారి పోయారని విమర్శించారు. మీవి గాలి హామీలని ప్రజలు గుర్తించారని.. మీ ముద్దులు పిడిగుద్దుల్లా మీమీదకే తిరిగి ప‌డుతున్నాయని ఎద్ద్దేవా చేశారు. సీఎం జగన్‌ నాటకాలు ఆడుతున్నారనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయిందన్నారు. జనం తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని వ్యాఖ్యానించారు.

‘‘ప్రతిప‌క్షంపైకి వాళ్లనీ, వీళ్లనీ పంప‌డం ఎందుకు? మీరే ఓసారి వ‌చ్చిపోకూడ‌దు. మా పెద్దాయ‌న మీలాంటి నేర‌ స్వభావం ఉన్నవారు కాదు. నువ్వు ముంచేయాల‌ని నిత్యం త‌పించే క‌ర‌క‌ట్ట ప‌క్క ఇంట్లో టీ, స్నాక్స్ పెట్టి మీకు తెలియ‌ని అభివృద్ధి అంటే ఏంటో వివరిస్తారు. కొత్త పరిశ్రమలు ఎలా తీసుకురావాలో సూచనలు ఇస్తారు. ఉపాధి అవకాశాలు ఎలా పెంచాలో చక్కగా వివరిస్తారు’’ అని లోకేశ్‌ అన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని