రఘురామకు లోక్‌సభ సచివాలయం నోటీసులు

తాజా వార్తలు

Updated : 15/07/2021 21:38 IST

రఘురామకు లోక్‌సభ సచివాలయం నోటీసులు

దిల్లీ: పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఫిర్యాదులపై ముగ్గురు ఎంపీలకు లోక్‌సభ సచివాలయం నోటీసులు జారీ చేసింది. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు, సిసిర్‌ అధికారి, సునీల్‌ కుమార్‌లకు నోటీసులు జారీ అయ్యాయి. రఘురామపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు వైకాపా ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఇటీవల స్పీకర్‌ను కలిసిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఫిర్యాదుకు అదనపు సమాచారం జోడించారు. మరోవైపు ఎంపీలు సిసిర్‌ అధికారి, సునీల్‌ కుమార్‌పై తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఫిర్యాదు చేసింది. 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని