Ts News: ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: పల్లా

తాజా వార్తలు

Published : 28/10/2021 19:36 IST

Ts News: ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: పల్లా

హనుమకొండ‌: యాసంగిలో పండిన ప్రతి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతు సమన్వయ సమితి ఛైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం సేకరణపై విధాన ప్రణాళికలు, కార్యాచరణ చేపట్టినట్లు పల్లా పేర్కొన్నారు. హనుమకొండలో పల్లా మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) పెడుతున్న షరతులు ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతాల్లో వరి పంటను వేసుకోవాలని.. నీరు అందుబాటులో లేని చోట్ల చిరు ధాన్యాలు, నూనె గింజలు, పత్తి పంటలు వేసుకోవాలని ప్రభుత్వం సూచించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరి వేయొద్దంటుందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని.. ఇది సరైంది కాదని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని