pawan kalyan: క్షేత్రస్థాయి పోరాటాలకు జనసేన సిద్ధం: పవన్‌ కల్యాణ్‌

తాజా వార్తలు

Updated : 24/09/2021 05:23 IST

pawan kalyan: క్షేత్రస్థాయి పోరాటాలకు జనసేన సిద్ధం: పవన్‌ కల్యాణ్‌

అమరావతి: వైకాపా పాలనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా స్పందించారు. వైకాపా దాష్టీకాలను దీటుగా ఎదుర్కొంటామన్నారు. ఎస్సీలపైనే ఎస్సీ అట్రాసిటీ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన పవన్‌ కల్యాణ్‌.. క్షేత్రస్థాయిలో పోరాటాలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు సృష్టించినా పరిషత్‌ ఎన్నికల్లో బలంగా పోరాడామని.. 25.2శాతం ఓట్లు సాధించామన్నారు.

నామినేషన్‌ ప్రక్రియ నుంచి కౌంటింగ్‌ వరకు వైకాపా అరాచకాలు చేస్తుంటే అధికారయంత్రాంగం చోద్యం చూసిందని దుయ్యమట్టారు. జనసేన విజయ ప్రస్థానం బింధువుతో మొదలైందంటూ .. పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. ఈ ఫలితాలు వ్యక్తిగతంగా తనకు చాలా ఆనందం కలిగించాయన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో వైకాపా పాలన ఉందన్నారు. పరిషత్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ప్రత్యర్థులపై దాడులు చేసి బెదిరింపులకు దిగారని.. వీరి దాష్టీకాలను చూసి ఓపిక నశించిందన్నారు. వైకాపా పాలనపై క్షేత్రస్థాయి పోరాటాలకు ఈనెల 27, 28 తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్న పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్రతి జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి ప్రజలపక్షాన నిలబడతామని, రాష్ట్రాన్ని కాపాడుకుంటామని పవన్‌ తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని